D-Vitamin కి, Depression కి లింక్ ఇదే.. కొత్త స్ట‌డీలో వెల్ల‌డి

by Sumithra |   ( Updated:2022-08-23 11:23:38.0  )
D-Vitamin కి, Depression కి లింక్ ఇదే.. కొత్త స్ట‌డీలో వెల్ల‌డి
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఆధునిక స‌మాజంలో మ‌నిషి సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందాడో అంత‌ డిప్రెషన్‌లోకి మునిగిపోయాడు. కార‌ణాలు ఏవైనా, మ‌నిషి మాన‌సికంగా కృంగిపోతున్న ప‌రిస్థితులు పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 280 మిలియన్ల మందిని క్లినికల్ డిప్రెషన్ ప్రభావితం చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా పేర్కొంది. ఈ క్ర‌మంలో, యూనివర్శిటీ ఆఫ్ ఈస్టర్న్ ఫిన్‌లాండ్ పరిశోధకుల కొత్త అధ్యయనం డిప్రెషన్, విటమిన్‌-డి మధ్య సంబంధాన్ని వెల్లడించింది.

ఈ అధ్యయనం ఇంత‌కుముందు నిర్వ‌హించిన 41 అధ్యయనాల మెటా-విశ్లేషణను ఆధారం చేసుకొని రూపొందించింది. ఈ మెటా-విశ్లేషణలో, 53,235 మంది పాల్గొన‌గా, వీరిలో డిప్రెషన్ అనుభ‌విస్తున్నావారు, డిప్రెష‌న్‌లో లేనివారు కూడా ఉన్నారు. ఇక‌, ఇందులో పాల్గొన్న కొంతమందికి ప్లేసిబో మందులు ఇవ్వ‌గా, కొంద‌రికి విట‌మిన్‌-డి పొందేట‌ట్లు చూసారు. కాగా, డిప్రెషన్‌తో బాధపడుతున్నవారికి ప్లేసిబో మెడిసెన్స్‌ కంటే విటమిన్-డి ఇవ్వడం చాలా ఉపయోగకరంగా ఉంటుందని కనుగొన్నారు. అధ్య‌య‌నాన్ని 'క్రిటిక‌ల్ రివ్యూస్ ఇన్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రీషియ‌న్‌'లో ప్ర‌చురించారు.

Advertisement

Next Story

Most Viewed