లాక్‌డౌన్‌కు మించిన మందు లేదు

by vinod kumar |
లాక్‌డౌన్‌కు మించిన మందు లేదు
X

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్

‘కరోనా వైరస్‌ నియంత్రణకు లాక్‌డౌన్ ఒక్కటే సరైన మార్గమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే తెలంగాణలో లాక్‌డౌన్‌ను మే 7వ తేదీ వరకు విధించామని, ఈ విషయంలో ఈ నెల 20 నుంచి కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చినా తెలంగాణలో ఇవ్వలేదని స్పష్టం చేశారు. ‘లాక్‌డౌన్ సమర్ధవంతంగా అమలుచేయలేని రాష్ట్రాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. వాటితో పోలిస్తే మనం బెటర్‌గా ఉన్నాం’ అన్నారు. కంటైన్‌మెంట్ జోన్లలో మనుషులెవరూ బయటికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా అప్పటికే ఉన్న ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల ద్వారా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. లాక్‌డౌన్, కంటైన్‌మెంట్ ఆంక్షలే లేకుంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఊహించలేమని తెలిపారు. లాక్‌డౌన్ ద్వారా చాలావరకు తెలంగాణలో వైరస్ వ్యాప్తిని నిరోధించగలిగామని వెల్లడించారు.

Tags: Lock down, extension, central govt, excemption, containment zones

Advertisement

Next Story