ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. హెల్త్ మినిస్టర్ కీలక ఆదేశాలు

by srinivas |
alla nani
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. గత కొన్నిరోజులుగా 100లోపు నమోదు అయ్యే కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వందల సంఖ్యల్లో నమోదు అవుతున్నాయి. దీంతో ఏపీలో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, రామచంద్రపురం ప్రాంతంలో 41కరోనా కేసులు నమోదు అయ్యాయి. దాంతో ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎవరు ఆందోళన చెoదొద్దని కోరారు.

కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినప్పటికీ వారిలో ఎలాంటి కరోనా లక్షణాలు లేవని తెలుస్తోందని ఆళ్ల నాని తెలిపారు. కరోనా సోకిన వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని తూర్పుగోదావరి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.గౌరీశ్వరరావును అదేశించిన తెలిపారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదు అయిన ప్రాంతంలో 50మీటర్లు దూరంలో కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిరంతరం పారిశుధ్య చర్యలు చేపట్టాలని పరిసర ప్రాంతంలో సూపర్ శానిటేషన్ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. నిరంతరం మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని.. కరోనా సోకిన వారిని హోమ్ క్వారంటైన్ ఉంచి వైద్య సిబ్బంది పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

కరోనా లక్షణాలు ఉన్న ఇద్దరిని కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉంచి మెరుగైన వైద్య సదుపాయం అందిస్తున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లో ఉన్న వారందరికీ కరోనా పరీక్షలు చేయించినట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ కూడ సెకండ్ వేవ్ కరోనా కేసులు నమోదు కాలేదని వెల్లడించారు. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉందని ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి సూచించారు. మాస్క్ లు ధరించాలని..భౌతిక దూరం కూడా పాటించాలని మంత్రి ఆళ్ల నాని రాష్ట్ర ప్రజలకు సూచించారు.

Advertisement

Next Story