- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Health Benefits With Aloe Vera.. ఉదయాన్నే తీసుకుంటే
దిశ, వెబ్‌డెస్క్ : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యంగా ఉండటం కూడా వరం అంటారు. ఎందుకంటే ప్రస్తుతం.. పుట్టిన పసికందు నుంచి వృద్ధుల వరకు చాలా మంది అనారోగ్యంతోనే బాధపడుతూ ఉంటుంన్నారు. ఇలా అనారోగ్య సమస్యలు ఉన్నవారు వాటి నుంచి బయటపడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే అనారోగ్య సమస్యలు తొలగించి ఆరోగ్యంగా ఉంచడానికి అలోవెరా బాగా ఉపయోగపడుతుంది. కేవలం చర్మానికి మాత్రమే కాకుండా ఎన్నో సమస్యలను తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం అలోవెరాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
అలోవెరా ముఖంపై మచ్చలు, మొటిమలను నయం చేస్తుంది. చర్మంపై గాయాలను మాన్పుతుంది. ముఖం మెరవడానికి బాగా ఉపయోగపడుతుంది. ముఖంపై మృత కణాలు తొలగిపోతాయి శరీరానికి విటమిన్ సీని ఇస్తుంది. ఈ విషయం చాలా మందికే తెలుసు అయితే చర్మానికే కాకుండా అలోవెరాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
అవి ఏమిటంటే.. బాడీ హైడ్రేట్ గా ఉన్నవారు ప్రతి రోజూ గ్లాస్ నీటిలో 20 శాతం అలోవెరా గుజ్జును కలిపి తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా ఉదయాన్నే పరిగడుపున ఒక గ్లాసు కలబంద జ్యూస్ తాగితే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అంతే కాకుండా తలనొప్పి మొదలు డీహైడ్రేషన్ వరకు ఎన్నో సమస్యలను పరిష్కరిస్తుంది. ఆరోగ్యకరమైన ఎర్రరక్తకణాలు లేకపోవడం వల్ల ఎనిమియా సమస్య వస్తుంది. పరిగడుపున అలోవెరా జ్యూస్ తాగితే ఎర్ర రక్త కణాలు పెరిగి ఎనీమియా సమస్యని తగ్గిస్తుంది, అలానే మంచి గ్లోయింగ్ స్కిన్ కూడా అలోవెరాతో మనం పొందవచ్చు. ఇలా మనకి కలబంద ఎంతగానో సహాయం చేస్తుంది. కడుపులో ఉండే వ్యర్థ పదార్థాలను తొలగించడంలో కూడా అలోవెరా జ్యూస్ బాగా సహాయపడుతుంది.