Health tips: పల్లీలతో ఆరోగ్యం.. ఈ కాలంలో తింటే మరీ మంచిది

by Anukaran |   ( Updated:2021-11-16 00:51:19.0  )
Health tips: పల్లీలతో ఆరోగ్యం.. ఈ కాలంలో తింటే మరీ మంచిది
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎవరి ఇంట్లోనైనా పోపు గింజలతో పాటు పల్లీలు కూడా ఉంటాయి. ఇవి మార్కెట్లో విరివిగా దొరుకుతాయి. అంతేకాకుండా వేరు శెనగ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని అందరికీ తెలిసిందే. ఇక చలి కాలంలో పల్లీలు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని పెద్దలు అంటారు. అయితే చలికాలంలో పల్లీలు తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

పల్లీలు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

చలికాలంలో పల్లీలు తినడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. జలుబు, దగ్గు తగ్గుతాయి. శ్వాస సంబంధిత సమస్యలు తొలగుతాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. అదేవిధంగా బాదంలో ఉండే పోషకాలు ఇందులో ఉంటాయి, అందువలన వీటిని తినడంతో శరీరంలో రక్తహీనతను నివారిస్తుంది. అంతే కాకుండా పల్లీలలో ప్రోటీన్, ఫ్యాట్ మరియు విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి, దీంతో వీటిని తినడం వల్ల బరువు తగ్గొచ్చు. అదే విధంగా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. పల్లీలు తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. పచ్చి పల్లీలను కానీ, ఒక గ్లాసు పల్లీల జ్యూస్‌ని కానీ తీసుకుంటే బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.

Advertisement

Next Story

Most Viewed