చలి కాలంలో చన్నీటితో స్నానం చేస్తున్నారా.. ఇది తెలుసుకోండి

by Anukaran |
చలి కాలంలో చన్నీటితో స్నానం చేస్తున్నారా.. ఇది తెలుసుకోండి
X

దిశ, వెబ్‌డెస్క్ : చలికాలం వచ్చిందంటే చాలు చాలా మంది చల్లటి నీటిని ముట్టుకోవడానికే జంకుతారు. ఇక మరగబెట్టిన వేడి నీళ్లతో స్నానం చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే చలికాలంలో కూడా చల్లటి నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు వైద్య నిపుణులు. చన్నీళ్లతో స్నానం చేయడం వలన బ్లడ్ సర్క్యూలేషన్ బాగా ఉంటుంది. అలాగే చన్నీటితో స్నానం చేయడం వలన శరీరం వేడెక్కుతుంది. దీంతో శరీరంలోని కొవ్వుకరిగి బరువు తగ్గడానికి వీలవుతోంది. అంతే కాకుండా చర్మం కాంతి వతంగా ఉండాలి, పొడిబారకుండా ఉండాలి అనుకునే వారికి ఈ చన్నీళ్లు ఎంతో బాగా ఉపయోగపడుతాయి అంటున్నారు వైద్య నిపుణులు. చల్లని నీళ్లతో స్నానం చేస్తే చర్మం కాంతి వతంగా, మెరుస్తూ ఉంటుంది. ఇలా స్నానం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. డిప్రెషన్ వంటి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు.

Advertisement

Next Story

Most Viewed