హీరోగా కనిపించబోతున్న హర్భజన్ సింగ్

by Jakkula Samataha |
హీరోగా కనిపించబోతున్న హర్భజన్ సింగ్
X

క్రికెటర్ హర్భజన్ సింగ్ త్వరలో లీడ్ రోల్‌లో వెండితెర మీద కనిపించబోతున్నారు. ఫ్రెండ్‌షిప్ అనే తమిళ సినిమా ద్వారా తెరంగేట్రం చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. స్నేహం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో హర్భజన్ లీడ్ రోల్‌లో కనిపించబోతున్నట్లు ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ గిరీష్ జోహర్ స్పష్టం చేశారు.

ఈ వార్త విన్న తర్వాత హర్భజన్ అభిమానులు ఆనందంలో మునిగితేలారు. ఆల్ ద బెస్ట్ బజ్జీ… అంటూ కామెంట్లు చేశారు. గతంలో హర్భజన్ కొన్ని టీవీ రియాలిటీ షోలలో కనిపించి సందడి చేశారు. అలాగే సెకండ్ హ్యాండ్ హజ్బెండ్ అనే సినిమాలో ఆయన ప్రత్యేక పాత్రలో కనిపించారు. కోలీవుడ్‌లో హర్భజన్ ఎంట్రీ సంతానం సినిమా ఢిక్కిలోనాతో అవుతుందని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story