- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ సిద్దిపేట: సిద్దిపేట జిల్లా ప్రజలకు మంత్రి హరీష్ రావు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పర్వదినాన్ని ప్రజలంతా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఆ పరమేశ్వరుని అనుగ్రహముతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని,స్వామి ఆశిస్సులతో సీఎం కేసీఆర్ నేతృత్వంలో సంక్షేమ ఫలాలు ప్రజలకు సమృద్ధిగా అందుతున్నాయన్నారు. బంగారు తెలంగాణ దిశగా ముందుకు పోతున్నామన్నారు.
ఆ పరమేశ్వరుని దయతో ఈ ఏటా సిద్దిపేట ప్రాంతానికి తొలిసారి యాసంగి పంటకు రంగనాయక సాగర్ ద్వారా సాగు నీరు ఇచ్చి రైతుల కళ్ళల్లో ఆనందం చూసే గొప్ప సంతృప్తినిచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో స్వామి అనుగ్రహముతో గోదావరి జలాలతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కాబోతున్నదన్నారు. స్వామి దీవెనతో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టాలని, ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ పర్వదినాన్ని జరుపుకోవాలన్నారు. మహా శివరాత్రి రోజున స్వామి వారి ఉపవాస దీక్ష లో ప్రజలందరూ భక్తితో స్వామిని కొలిచి మీ కోర్కెలు నెరవేరాలి అని.ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాని కోరుకున్నారు.