పెళ్లి కొడుకే ఆలస్యంగా వస్తే ఎలా? : ఖుష్బూ

by Shyam |
పెళ్లి కొడుకే ఆలస్యంగా వస్తే ఎలా? : ఖుష్బూ
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నటి ఖుష్బూ, దర్శకులు పి. సుందర్‌ల వివాహ బంధానికి 20 ఏళ్లు. ఈ సందర్భంగా తన ధైర్యం, బలం అయిన సుందర్‌.. నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు ఖుష్బూ. కష్ట సుఖాల్లో, జయాపజయాల్లో ఇద్దరం ఒకరికొకరు తోడున్నామని… 20 ఏళ్లు గడిచిన ఏ మాత్రం మార్పు రాలేదని తెలిపారు. నీ పక్కన కూర్చుని మాట్లాడుతుంటే నువ్వు నవ్వడం చాలా బాగుంటుందన్నారు ఖుష్బూ. కానీ నీ పెళ్లికి నువ్వే ఆలస్యంగా కళ్యాణ మండపానికి చేరుకున్నావని సుందర్‌కు గుర్తు చేశారు. కాగా ఖుష్బూ, పి.సుందర్‌ల మ్యారేజ్ డేను పురస్కరించుకుని సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. స్వీట్ కపుల్‌కు మ్యారేజ్ యానివర్సరీ విషెస్ చెప్తూ రాధికా శరత్ కుమార్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ట్వీట్ చేశారు.

Tags: Khushbu, P. Sundar, Marraige Anniversary, Wishes

Advertisement

Next Story