- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పల్లె ప్రగతి పనులను పరిశీలించిన కలెక్టర్
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని పోసానిపల్లిలో పల్లె ప్రగతి పనులను కలెక్టర్ హనుమంతరావు తనిఖీ చేశారు. గ్రామం పరిశుభ్రంగా ఉందని, పనులు వేగవంతం చేయాలని సూచిస్తూ సర్పంచ్ శామ్ రావును అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పచ్చదనం – పరిశుభ్రతతో కళకళలాడేలా చూడాలని అన్నారు. పల్లె ప్రగతిలో వారం రోజులు గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శి, సర్పంచులతో సమావేశాలు ఏర్పాటు చేసి నేరుగా మాట్లాడితే వంద శాతం పనులవుతాయని అన్నారు. గ్రామాలలో నిర్మిస్తున్న వైకుంఠ ధామాలు, డంప్ యార్డులు, ఇంకుడు గుంతలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నర్సరీల ఏర్పాటుతో పాటు చుట్టూ ఫెన్సింగ్ చేసి గేటు, బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ, తహశీల్దార్, తదితరులు పాల్గొన్నారు.