అద్భుతంగా హస్తకళ క్లాత్ క్యాలెండర్

by Shyam |
అద్భుతంగా హస్తకళ క్లాత్ క్యాలెండర్
X

దిశ, మునుగోడు: వస్త్రంపై సహజ రంగులతో హస్తకళల నైపుణ్యంతో నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఫ్యాషన్ డిజైనర్ కృష్ణమూర్తి రూపొందించారు. చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం మినీ క్రాఫ్ట్ హస్తకళల కేంద్రంలో ఫ్యాషన్ డిజైనర్ కృష్ణమూర్తి రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను చౌటుప్పల్ ఆర్డీఓ సూరజ్ కుమార్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. హస్త కళలను అందరూ ఆదరించాలని అన్నారు. ప్రాచీన కళలకు పునరుజ్జీవం పోయడానికి మినీ క్రాఫ్ట్‌లు, హస్త కళాకారులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. పర్యావరణానికి అనుకూలంగా ఉండే హస్తకళల ఉత్పత్తులను కొనుగోలు చేసి పర్యావరణాన్ని, హస్త కళాకారులను కాపాడాలని ఆయన కోరారు.

Advertisement

Next Story