మూడు రాజధానుల అంశంపై జీవీఎల్ క్లారిటీ!

by srinivas |
మూడు రాజధానుల అంశంపై జీవీఎల్ క్లారిటీ!
X

దిశ, వెబ్ డెస్క్: మూడు రాజధానులపై అంశంపై ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం ఇంకా కొనసాగుతోంది. అటు మీడియలోనూ, ఇటు సోషల్ మీడియాలో వైసీపీ, టీడీపీ నాయకులు హాట్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అయితే, రాజధాని అంశం రాష్ట్రం పరిధిలోకే వస్తుందని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. గురువారం ఏపీ రాజధాని అంశంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని దాఖలైన అఫిడవిట్‌కు కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ రాజధాని అంశంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదంటూ ఆ అఫిడవిట్‌లో పేర్కొంది. రాష్ట్ర రాజధానుల నిర్ణయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఆధారపడి ఉంటుందని కేంద్రం స్పష్టంచేసింది. కాగా, కొందరు బీజేపీ నేతలు మాత్రం రాజధాని అంశంలో ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ తరుణంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు స్పందించారు. ఈరోజు న్యూ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర రాజధాని అంశం కేంద్ర పరిధిలోనిది కాదని మరోసారి స్పష్టంచేశారు. అంతటితో ఆగకుండా.. కొందరు నేతలు వారి వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ లైన్‌కు విరుద్ధంగా చెబుతున్నారని జీవీఎల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కావాలనే బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని జీవీఎల్ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed