- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విశాఖ ప్రమాదంపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్డెస్క్: కెమికల్ ఫ్యాక్టరీల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో విశాఖ నగరం వణుకుతోంది. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం తర్వాత మరో రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా సాల్వెంట్ కంపెనీలో ట్యాంకు పేలడంతో ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఈ నేపథ్యంలో విశాఖ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. జరుగుతున్న ఘటనలపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతున్న ప్రమాదాల వెనుక అనేక కుట్రలున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయని.. వీటిపై లోతైన విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి జగన్ ను కోరుతున్నానని చెప్పారు.
విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసి, రాజధానిని ఇక్కడికి రాకుండా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయనే భయం కలుగుతోందని అమర్నాథ్ అన్నారు. 2014లో అమరావతి కోసం భూములు ఇవ్వని రైతుల అరటి తోటలను తగలబెట్టి, వైసీపీ మీద ముద్ర వేశారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏ ప్రమాదం జరిగినా శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రమాదాలపై సీఎం జగన్ మాట్లాడటం లేదని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదని అమర్నాథ్ చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ కేసులో విచారణ జరిపించి, దోషులను జైలుకు పంపించారని చెప్పారు. టీడీపీ హయాంలో జరిగిన ప్రమాదాల్లో ఒక్కరినైనా చంద్రబాబు జైలుకు పంపించారా? అని ప్రశ్నించారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీయాలనుకునే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు.