వధువు పక్కనే కూర్చుని వరుడు చేసిన పనికి అంతా షాక్.. వీడియో వైరల్

by Shyam |   ( Updated:2023-05-19 08:17:02.0  )
Marriage
X

దిశ, వెబ్‌డెస్క్ : వివాహ వేడుక అనగానే ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. బంధువుల హడావుడి అంతా ఇంతా కాదు. ఇక వరుడు, వధువు ముఖంలో చిరునవ్వు విరబూస్తుంది. వివాహ వేడుకల్లో కనిపించే సరదా దృశ్యాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. పెళ్లి వేడుకలో వరుడు, వధువు మధ్య జరిగే సంభాషణలు, సన్నివేశాలు చూడముచ్చటగా ఉంటాయి.

ఇలాంటి పెళ్లి వేడుకలో ఓ వరుడు అందరికీ షాక్ ఇస్తూ.. వధువు పక్కన ఉండగానే స్టేజిపై కూర్చీలో కూర్చుని గుర్రుపెట్టి మరీ నిద్రపోయాడు. వినడానికి కొంచెం వింతగా ఉన్నా.. ఇది నిజమే.. జనసందోహం మధ్యే పెళ్లిమండపంలో నిద్రపోతున్న ఓ వరుడి వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరీ మీరు కూడా ఓ లుక్ వేయండి.

ఈ వీడియోలో పెళ్లికి వచ్చిన అతిథులతో వధువు సరదాగా మాట్లాడుతుండగా.. వరుడు మాత్రం హాయిగా నిద్రపోవడం కనిపించింది. భార్య భుజంపై చేయి వేసి నిద్రపోతున్న వరుడ్ని లేపి కూర్చోబెట్టేందుకు పక్కనే ఉన్న వరుడి స్నేహితులు ప్రయత్నిస్తుండటం విశేషం. ఈ వీడియోను నిరంజన్ మహాపాత్ర అనే యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లికి మందు వేసి వచ్చావా.? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed