మనవడి కోసం సొంత మనవరాలి కిడ్నాప్.. ఆ బామ్మ రూటే సెపరేటు!

by srinivas |   ( Updated:2021-07-10 09:21:58.0  )
మనవడి కోసం సొంత మనవరాలి కిడ్నాప్.. ఆ బామ్మ రూటే సెపరేటు!
X

దిశ, వెబ్‌డెస్క్ : తాను చెప్పిన పనిని కూతురు చేయలేదనే కోపంతో సొంత మనవరాలినే కిడ్నాప్ చేయించిందో ఓ అమ్మమ్మ. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా తిరుపతి పరిధిలోని తిరుచానూర్‌లో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. 29ఏళ్ల తన మనవడు మురళీ కృష్ణను పెళ్లి చేసుకోవాలని మైనర్ బాలికను తన అమ్మమ్మ కొద్దిరోజులుగా బలవంతం చేస్తోంది. అయితే, దీనికి తన కూతురు అడ్డు చెప్పడంతో సొంత మనవరాలిని అమ్మమ్మ కిడ్నాప్ చేయించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధిత తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని కిడ్నాప్ అయిన బాలిక కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story