- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నో రూల్స్.. ఓన్లీ షెడ్యూల్ : మే 26 వరకు ఆన్లైన్ క్లాసెస్!
దిశ, తెలంగాణ బ్యూరో : కార్పోరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాయి. కేవలం ఫీజులను వసూలు చేసేందుకు ప్రభుత్వ జీఓలను లెక్కచేయకుండా ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు. శ్రీ చైతన్య విద్యాసంస్థ నిబంధలను బేఖాతరు చేస్తూ తరగతులు నిర్వహిస్తున్నట్టుగా షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. ప్రభుత్వం కరోనా వ్యాధి వ్యాప్తి కట్టడి నేపథ్యంలో పాఠశాల విద్యార్థులకు పరీక్షలను రద్దు చేసి పై తరగతులకు ప్రమోట్ చేసింది.
ఆన్‌లైన్ తరగతులను కూడా రద్ధు చేసి వేసవి సెలవులను ప్రకటించింది. మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని జూన్ 1న పాఠశాలల నిర్వహణపై చర్చలు జరిపి నిర్ణయాన్ని వెల్లడిస్తామని స్పష్టంగా ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నిబంధనలు వర్తిస్థాయని తెలిపారు. ఇందుకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు తరగతులు నిర్వహించినా ఫీజులు వసూలు చేసినా తగని చర్యలు చేపడుతామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెట్టిన శ్రీ చైతన్య విద్యాసంస్థ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తుంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారమంటూ సూచిస్తూ మే 26 వరకు అన్ని తరగతులు నిర్వహిస్తున్నట్టుగా షెడ్యూల్‌ను విడుదల చేశారు. తిరిగి పాఠశాలలను జూన్ 14న ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా ఆన్‌లైన్ తరగతుల నిర్వహణపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కేవలం ఫీజులను వసూలు చేసేందుకే ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పాఠశాలల నుంచి తరచూ ఫోన్ చేసి ఫీజులు చెల్లించాల్సిగా వేధింపులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్ధలపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.