పేదలకు మరింత నగదు అవసరం : నోబెల్ గ్రహీత అభిజిత్!

by Harish |
పేదలకు మరింత నగదు అవసరం : నోబెల్ గ్రహీత అభిజిత్!
X

దిశ, వెబ్‌డెస్క్: రానున్న రోజుల్లో పేదలకు ప్రభుత్వం మరింత నగదు పంపిణీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ అన్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్(ఎన్‌సీఏఈఆర్) నిర్వహించిన ఆన్‌లైన్ ప్యానెల్ సమావేశంలో పాల్గొన్న ఆయన, సామాజిక సంక్షేమ వ్యవస్థను పూర్తిగా పునరుద్ధరించాలని సూచించారు. కరోనా సంక్షోభం నుంచి బయటపడేందుకు పేదల చేతుల్లోకి ప్రభుత్వం నగదు చేర్చే పరిష్కారం ప్రయోజనకరమైనదే అయినప్పటికీ, అది పెద్ద మొత్తంలో ఉండాలని బెనర్జీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఈ అంశంపై సరైన నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాను. ఇది ఏ ప్రభుత్వమైన చేయాల్సిన ప్రాథమిక విధి అని అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ కాలం కొనసాగనుంది, రికవరీ కావడానికి మరింత మూల్యాన్ని కోరుకుంటుంది. ఇలాంటి సంక్షోభ సమయంలో వ్యవస్థను పునః రూపకల్పన చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదనుకుంటున్నాను’ అని బెనర్జీ పేర్కొన్నారు. ‘ఎవరికైనా రేషన్ కార్డు అవసరమైతే ఇలాంటి పరిస్థితుల్లో మీరు పౌరులేనా? మీకు అర్హత ఉందా? లాంటి ప్రశ్నలతో సంబంధం లేకుండా ఉండే స్థితి కల్పించాలి. అంతే కానీ, కొత్త పరికరాలను కనిపెట్టేందుకు ప్రయత్నించడం బ్యాడ్ ఐడియా’ అవుతుందన్నారు. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటివి స్వల్పకాలిక అత్యవసర సాధనంగా ఉపయోగించలేమని, ఇలాంటి పథకాలను ఎమర్జెన్సీ రెస్పాన్స్ కోసం రూపొందించబడలేదు. కాబట్టి మొత్తం సంక్షేమ వ్యవస్థలో మార్పులు అవసరమని బెనర్జీ అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed