- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎయిర్ కండీషనర్‌ల దిగుమతిపై నిషేధం
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇటీవల పలు ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కలర్ టీవీ (colour tv)లను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం, తాజాగా ఎయిర్ కండీషనర్ (AC)లను దిగుమతి (Import) చేసుకోవడంపై నిషేధం (Banned) విధించింది. ఇతర దేశాల నుంచి ఏసీలను దిగుమతిని నిరాకరిస్తున్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ ఓ ప్రకటనలో తెలిపారు.
గతేడాది స్వదేశీ తయారీకి ప్రాధాన్యతను ఇస్తూ ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత, అత్యవసరమైన వస్తువులను మాత్రమే దిగుమతి చేసుకునేలా, ఇతర ఉత్పత్తులను తగ్గించుకునేలా చర్యలు తీసుకుంటోంది. దేశీయంగా సుమారు 30 శాతం ఏసీలను వేరే దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయని, వీలైనంత తొందరలో వాటిని తగ్గించుకునే ప్రయత్నాలను అమలు చేయాలని ఇదివరకు ప్రధాని మోదీ (PM modi) ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తాజా చర్యలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, ఎయిర్ కండీషనర్ల దేశీయ మార్కెట్ విలువ సుమారు రూ. 36.5 వేల కోట్లుగా ఉన్నట్టు అంచనా. తాజా నిర్ణయంతో దేశీయ పరిశ్రమకు అతిపెద్ద ప్రోత్సహాన్ని ఇస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.