కల్నల్ సంతోష్ బాబుకు ఘనంగా నివాళి

by Shyam |
కల్నల్ సంతోష్ బాబుకు ఘనంగా నివాళి
X

దిశ, క్రైమ్‌బ్యూరో: భారత్ సరిహద్దులో చైనా దురాగతానికి అమరుడైన కల్నల్ సంతోష్ బాబు పార్థివ దేహం బుధవారం సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్ హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. సంతోష్‌బాబు పార్థివ దేహానికి గవర్నర్ తమిళిసై, హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి కేటీఆర్, ఎంపీ రేవంత్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత ప్రత్యేక అంబులెన్స్‌లో సంతోష్‌బాబు పార్థివ దేహాన్ని సూర్యాపేటకు తరలించారు. రేపు ఉదయం 8గంటలకు సూర్యాపేట సమీపంలోని కేసారంలో సంతోష్‌బాబు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కల్నల్ సంతోష్‌బాబు భార్య సంతోషిని సీపీ సజ్జనార్ రిసీవ్ చేసుకున్నారు.

Advertisement

Next Story