అమర జవాన్‌కు గవర్నర్ నివాళి

by Anukaran |   ( Updated:2020-11-10 12:16:27.0  )
అమర జవాన్‌కు గవర్నర్ నివాళి
X

దిశ, క్రైమ్ బ్యూరో: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మహేశ్ మృతదేహం మంగళవారం రాత్రి శంషాబాద్ విమనాశ్రయానికి చేరుకుంది. ఈ సందర్బంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జవాన్‌ పార్థివదేహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అనంతరం జవాన్ మహేశ్ సొంతూరు అయిన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్‌పల్లి గ్రామానికి మృతదేహాన్ని తరలించారు. మహేశ్ కుటుంబసభ్యులకు రూ.50లక్షల ఆర్థికసాయంతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటిస్థలం ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

Advertisement

Next Story