- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వం వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోంది.
దిశ, దుబ్బాక :
తనను వ్యక్తిగత వేధింపులకు ప్రభుత్వం గురి చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. బీజేపీ కార్యకర్తల వాహనాల్లో డబ్బులు పెట్టి, కేసులు నమోదు చేయించే కుట్రలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ….నిన్నటి రోజు దుబ్బాకలో వాహనాన్ని పది మంది సీఐలు, పది మంది ఎస్సైలు, ముగ్గురు ఏసీపీలు, 150 మంది పోలీసు బందోబస్తు మధ్య తనిఖీ చేశారని ఆయన అన్నారు. అదొక కుట్రపూరిత చర్య అని అన్నారు. కొంతమంది పోలీసు అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారనీ, తప్పుడు సమాచారంతో తమను రోజుకో విధంగా వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. తప్పుడు సమాచారంతో ఉదయం నుండి రాత్రి వరకు ఒక రకంగా.. రాత్రి నుండి ఉదయం వరకు మరొక రకంగా పోలీసులు హైడ్రామా చేశారని అన్నారు. ఎందుకిలా చేస్తున్నారని పోలీసులను వివరణ కోరితే సరైన సమాధానం కూడా చెప్పలేదన్నారు. మిమ్మల్ని వ్యక్తి గతంగా మంత్రి హరీశ్ రావు టార్గెట్ చేస్తున్నట్టు వారు తెలిపారని ఆయన చెప్పారు. తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదని ఆరోపిస్తున్న హరీశ్ రావు, వాటిని నిరూపించేందుకు సిద్దమా అని సవాల్ విసిరారు….