కేటీఆర్ ఎంతో చేస్తారనుకున్నా.. కానీ !

by Shyam |
కేటీఆర్ ఎంతో చేస్తారనుకున్నా.. కానీ !
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ పరిధిలో నాలాలపై అక్రమ కట్టడాలు కూల్చడంలో ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ వ్యాప్తంగా 28వేల అక్రమకట్టడాలను జీహెచ్ఎంసీ గుర్తించిందని, 2016లోనే వాటిని కూల్చితే ఇంత కష్టం వచ్చేది కాదన్నారు. బుద్ధభవన్‌ లాంటి ప్రభుత్వ భవనాలు సైతం నాలాలపై ఉన్నాయని, గత ప్రభుత్వాలపై నిందలు వేయకుండా ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని మండిపడ్డారు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఎంతో చేస్తారని ఊహించానని.. కానీ ఆయన పనితీరు నిరుత్సాహ పరిచిందన్నారు. సుందరీకరణ మాత్రమే హైదరాబాద్ నగర అభివృద్ధి కాదని, రాష్ట్ర, జిల్లా స్థాయిలో విపత్తు నిర్వహణ సంస్థ ఏర్పాటు చేయాలన్నారు. మంగళవారం ఓ న్యూస్‌ ఛానల్‌తో మాట్లాడుతూ మర్రిశశిధర్‌రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story