సర్కారు బడి ఆణిముత్యం.. బాసర త్రిబుల్ ఐటీకి ఎంపిక

by Sridhar Babu |
సర్కారు బడి ఆణిముత్యం.. బాసర త్రిబుల్ ఐటీకి ఎంపిక
X

దిశ, ఖమ్మం రూరల్ : తెలంగాణ రాష్ట్రంలోనే బాసర త్రిబుల్ ఐటీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ ఎంపికైనటువంటి విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులు అనుమతి పొందుతున్నారు. ఈ సంవత్సరం మంగళగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని మోర యమున పాలిటెక్నిక్‌లో వచ్చిన ర్యాంకు ప్రకారం బాసర త్రిబుల్ ఐటీ‌కి ఎంపిక అయినది. విద్యార్థిని ఎంపిక కావడంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.నాగిరెడ్డి ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు అభినందించారు. వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉపాధ్యాయ మిత్ర బృందం శుభాశీస్సులు అందజేశారు.

Advertisement

Next Story