వలంటీర్లకు శుభవార్త..!

by srinivas |   ( Updated:2020-04-22 05:17:20.0  )
good news to ap volunteer
X

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వలంటీర్లకు శుభవార్త చెప్పింది. ఏపీలో కరోనా కట్టడిలో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు భాగమవుతూ గ్రామాలు, పట్టణాల్లో సేవలందిస్తున్న వలంటీర్లకు రూ. 50 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ నుంచి పంచాయతీ రాజ్ శాఖకు సర్క్యులర్ జారీ అయింది.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.60 లక్షల మందికి పైగా వలంటీర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరందరికీ పీఎంజీకే (ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్) ప్యాకేజీ కింద బీమా సౌకర్యం కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్-19 ఇంటింటి సర్వేలో వలంటీర్లే కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ వ్యక్తులతో వలంటీర్లు నేరుగా కాంటాక్ట్ అవుతుండడంతో, వైరస్ సోకే ప్రమాదం ఉన్నందునే, సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

tags: ap, volunteer, insurance, pmgk bima, ysrcp, government

Advertisement

Next Story