మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మారిన టైమింగ్స్

by Anukaran |
Hyderabad metro
X

దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్ నగర మెట్రో ప్రయాణికులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. నగరవాసుల సౌకర్యార్థం టైమింగ్స్‌లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ఉదయం 6 గంటల నుంచే మొదటి మెట్రో ట్రైన్ అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా, రాత్రి 10.15 గంటలకు చివరి స్టేషన్‌ నుంచి మెట్రో రైలు బయలుదేరి.. రాత్రి 11.15 గంటలకు గమ్యస్థానానికి చేరుకోనుంది.

కాగా, ఇప్పటి వరకు మెట్రో సర్వీస్‌లు ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతున్నాయి. అయితే, మెట్రో టైమింగ్స్‌ని మార్పు చేసి ఉదయం 6 గంటలకు మొదటి ట్రైన్ అందుబాటులోకి తీసుకురావాలని ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‌కు కోరారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్.. హెచ్‌ఎంఆర్‌‌ఎల్ ఎండీకి ట్వీట్ చేయగా.. ఈ విషయంపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్‌లో వెల్లడించారు. కాగా రాత్రి 10 గంటలు దాడితే ఆర్టీసీ బస్సులు కూడా ఉండటం లేదని, వాటిని రాత్రి 12 గంటల వరకు సర్వీస్‌లను నడపాలని నగర ప్రయాణికులు మంత్రిని కోరుతున్నారు.

Advertisement

Next Story