- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోథ్ బస్టాండ్ పరిరక్షణకు కృషి : ఏఎంసీ చైర్మన్
దిశ,బోథ్ : మండల కేంద్రంలోని అన్యాక్రాంతమవుతున్న బస్టాండ్ పరిసరాలను ప్రభుత్వ ఆస్తుల రక్షణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని వాటిని రక్షించడానికి చర్యలు చేపడుతున్నామని ఏఎంసీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో బస్టాండ్ కి ప్రహరీ గోడ లేకపోవడం ప్రయాణికులకు పార్కింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని వాటిని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క దృష్టికి, రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే గురువారం బస్టాండ్ డిజిటల్ మ్యాప్ ఆధారంగా ప్రహరీ కోసం కొలతలు సేకరించారు. బస్టాండ్ లో రాత్రి సమయంలో ఇబ్బందిగా ఉందని లైటింగ్, మంచినీరు, పశువులు రాకుండా ఉండేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది, వి డి సి చైర్మన్ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.