కస్టమర్లకు గుడ్ న్యూస్.. ‘DMart’ క్యారీ బ్యాగులపై న్యాయస్థానం సంచలన ఆదేశాలు

by Anukaran |   ( Updated:2021-12-21 01:04:19.0  )
కస్టమర్లకు గుడ్ న్యూస్.. ‘DMart’ క్యారీ బ్యాగులపై న్యాయస్థానం సంచలన ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : మనం ఎక్కడికైనా షాపింగ్‌కు వెళ్లినా, సూపర్ మార్కెట్‌కు వెళ్లినా క్యారీ బ్యాగుకు ఎంతో కొంత డబ్బు చెల్లించాల్సిందే. క్యారీ బ్యాగ్‌ను ఫ్రీగా అసలు ఇవ్వరు. దీంతో ఓ వ్యక్తి ఈ విషయంపై వినియోగదారుల ఫోరం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం సంచలన తీర్పు వెల్లడించింది. క్యారీ బ్యాగులపై సదరు షాప్ లోగో ఉన్నా.. లేకున్నా.. కస్టమర్లకు ఉచితంగానే క్యారీ బ్యాగులు ఇవ్వాలని ఆదేశించింది. క్యారీ బ్యాగులకు డబ్బులు వసూలు చేయవద్దని సూచించింది.

ఏం జరిగింది..

హైదరాబాద్‌లోని తార్నాకకు చెందిన భగేల్కర్‌ ఆకాశ్‌కుమార్‌ 2019 మే 11న హైదర్‌నగర్‌లోని డీమార్ట్‌లో రూ.602.70 విలువ చేసే సరుకులు కొనుగోలు చేశాడు. ఇందులో ప్లాస్టిక్‌ బ్యాగుకు రూ.3.50 వసూలు చేశారు. ఈ నేపథ్యంలో బిల్లు చూసి నిలదీసిన కస్టమర్.. సంస్థ పేరు ముద్రించినా తన వద్ద ఛార్జీ వసూలు చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో ఆయన వినియోగదారుల కమిషన్‌ని ఆశ్రయించారు.

దీంతో సదరు డీమార్ట్ సంస్థ ఈ ఆరోపణలపై స్పందించింది. తమ వద్ద బ్రాండ్‌ పేరుతో ఉన్నవి, లేని బ్యాగులున్నాయని తెలిపింది. అవి తీసుకోవాలా వద్దా అనే కస్టమర్ల ఇష్టమని రాతపూర్వకంగా వివరణ ఇచ్చింది. సంస్థ వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం 2018 మార్చి 27న సవరించి నోటిఫై చేసిన నిబంధనల ప్రకారం వినియోగదారులకు ఉచితంగానే క్యారీ బ్యాగులు ఇవ్వాలని సూచించినట్లు న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

కస్టమర్ వద్ద క్యారీ బ్యాగ్ కోసం వసూలు చేసిన రూ.3.50 తిరిగి చెల్లించడంతో పాటు, పరిహారంగా రూ.1,000, న్యాయ సేవాకేంద్రానికి రూ.1,000 చొప్పున చెల్లించాలని హైదర్‌నగర్‌ డీమార్ట్‌ స్టోర్‌ను ఆదేశించింది. అంతేకాకుండా 45 రోజుల్లో తీర్పు అమలు కాకపోతే.. చెల్లించాల్సిన మొత్తానికి 18శాతం వడ్డీ కలిపి ఇవ్వాలని ఆదేశించింది. దీంతో న్యాయస్థానం ఆదేశాలపై కస్టమర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్.. జనవరి 14 వరకు లాక్‌డౌన్, స్కూల్స్ బంద్

Advertisement

Next Story

Most Viewed