Airtel కస్టమర్లకు గుడ్ న్యూస్..

by Anukaran |   ( Updated:2021-08-08 00:12:10.0  )
airtel news
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎయిర్‌టెల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. మీరు ఎయిర్‌టెల్ సిమ్ వాడుతున్నారా.. అయితే మీ కోసమే ఓ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు రీచార్జ్ ప్లాన్లపై రూ. 4 లక్షల వరకు ఫ్రీ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అందిస్తోంది. ఎయిర్ రెండు ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్లపై ఉచితంగానే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రయోజనం కల్పిస్తోంది.

రూ.279, రూ.179 రీచార్జ్ ప్లాన్లపై కస్టమర్లు ఈ బెనిఫిట్ పొందొచ్చు. రూ.279 ప్లాన్‌పై రూ.4 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుంది. అదే రూ.179 ప్లాన్‌పై అయితే రూ.2 లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుంది. రూ.279 ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా వస్తుంది. వాలిడిటీ 28 రోజులు. అపరిమితి కాల్స్ చేసుకోవచ్చు. అదే రూ.179 ప్లాన్ విషయానికి వస్తే.. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. రూ.2 లక్షల ఇన్సూరెన్స్ లభిస్తుంది. 2 జీబీ డేటా వస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.

Advertisement

Next Story