- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇలాంటి మాంద్యాన్ని ఇండియా ఎన్నడూ చూడలేదు: గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా!
దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ బ్రోకరేజ్ గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ ఇండియా జీడీపీ అంచనాలను సర్దుబాటు చేసింది. లాక్‌డౌన్ వల్ల గడిచిన రెండు నెలలుగా దేశ వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఇలాంటి సమయంలో దేశంలో ఎన్నడూ లేనంత మాంద్యం తప్పదని ‘గోల్డ్‌మన్ సాచ్స్’ గ్రూప్ అభిప్రాయపడింది. రెండో త్రైమాసికానికి దేశ జీడీపీ 45 శాతానికి పడిపోయే అవకాశముందని వెల్లడించింది. గతంలో విడుదల చేసిన నివేదికలో 20 శాతమే తగ్గే అవకాశముందని గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే, మూడో త్రైమాసికానికి 20 శాతం పెరిగే అవకాశమున్నట్టు గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక పేర్కొంది. నాలుగో త్రైమాసికానికి 14 శాతం, తర్వాతి ఏడాది తొలి త్రైమాసికంలో 6.5 శాతం వద్ద ఉండే అవకాశముందని గోల్డ్‌మన్ సాచ్స్ అంచనాలను ప్రకటించింది. ప్రస్తుత అంచనాల ప్రకారం.. రానున్న ఏడాదిలో 2021 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీడీపీ 5 శాతానికి క్షీణించే అవకాశముందని గోల్డ్‌మన్ సాచ్స్ ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. ఇండియా ఇలాంటి మాంద్యాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని, ఈ సమయంలో ఉద్దీపనగా ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక ప్రగతిపై వెంటనే ప్రభావం చూపించవని గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ ఆర్థిక నిపుణులు తెలిపారు.