ఇతని ముందు.. సినిమా చోరీలు కూడా వేస్ట్

by srinivas |
ఇతని ముందు.. సినిమా చోరీలు కూడా వేస్ట్
X

వినూత్న తరహా దొంగతనాలు సినిమాల్లోనే కనిపిస్తుంటాయి. ఇలాంటి దొంగతనాలు కూడా జరుగుతాయా? అన్నంత నైపుణ్యంతో ఉంటాయా దొంగతనాలు. అలాంటి దొంగతనాన్నే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పోలీసులు ఛేదించారు. ఆ దొంగతనం వివరాల్లోకి వెళ్తే… ఏలూరుకి చెందిన వ్యక్తి తన నివాసానికి దగ్గర్లోని ప్రైవేట్‌ ఫైనాన్స్‌లో సుమారు అరకేజీ బంగారాన్ని తాకట్టు పెట్టాడు. ఫైనాన్స్‌ కార్యాలయానికి అతను ఫోన్‌ చేసి.. డబ్బులు కట్టెయ్యాలనుకుంటున్నానని, ఇంటికి వచ్చి తన నగలను అప్పగిస్తే డబ్బులిచ్చేస్తానని నమ్మబలికాడు. తెలిసిన వ్యక్తే కదా అని సదరు ఫైనాన్స్ సిబ్బంది నగలతో ఆయన ఇంటికి వచ్చారు. వెంటనే తన మనుషులతో వారిపై దాడికి దిగి నగలతో ఉడాయించాడు. దీంతో నిర్ఘాంతపోయిన ఫైనాన్స్ సిబ్బంది వెంటనే ఏలూరు టూటౌన్ సీఐ ఆది ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన సీఐ, ఎస్సై కిశోర్ బాబుతో కలిసి నిందితుడ్ని వెంబడించి పట్టుకున్నారు. అతని నుంచి 70 కాసుల బంగారం, లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed