తగ్గిన బంగారం స్పీడ్

by Harish |
తగ్గిన బంగారం స్పీడ్
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19( kovid-19) దెబ్బకు బంగారం ధరలు(Gold prices) అడ్డులేకుండా దూసుకెళ్లాయి. గత వారం(Last week) చివరి వరకు భగ్గుమన్న పసిడి ధరలు రెండు రోజులుగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు(International markets) సానుకూలంగా ఉండటం, వ్యాక్సిన్(Vaccine) వచ్చేసిందనే సంకేతాల నేపథ్యంలో బంగారం బుధవారం భారీగానే తగ్గింది. ఆకాశమే హద్దుగా ఎగిసిన బంగారం ధరలకు రష్యా వ్యాక్సిన్(Russia vaccine) అడ్డుపడింది. దీంతో బంగారం ధరలు(Gold prices) తలొగ్గక తప్పలేదు.

హైదరాబాద్ మార్కెట్‌(Hyderabad Market)లో 10 గ్రాముల 24 క్యారెట్ల(24 carats) బంగారం ధర ఏకంగా రూ. 3,350 తగ్గి రూ. 54,680 కి చేరింది. బంగారం బాటలోనే వెండి(Silver) సైతం భారీగానే దిగొచ్చింది. వెండి కిలో రూ. 7,500 తగ్గి రూ. 65 వేలకు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 3,010 తగ్గడంతో రూ.50,130 ధరకు చేరుకుంది.

ఆక్స్‌ఫర్డ్(Oxford), భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌(Bharat Biotech Vaccine)లు సైతం విజయవంతంగా మార్కెట్లోకి వస్తే పసిడి మరింత దిగిరానున్నట్టు మార్కెట్ వర్గాలు (Market categories) చెబుతున్నాయి. అంతేకాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో( international market) బంగారం ధర ఔన్స్ 1,939కి చేరుకుంది. ప్రధాన నగరాల్లో పరిశీలిస్తే..చెన్నైలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 54,680 ఉండగా, ముంబైలో రూ. 52,400, ఢిల్లీలో రూ. 54,500, కోల్‌కతా రూ. 53,450, బెంగళూరులో రూ. 54,600గా ఉంది.

Advertisement

Next Story