- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విఘ్నేశ్వరా.. మా మాన, ప్రాణాలను కాపాడు స్వామీ.. గణేషుడికి యువతుల లేఖ
దిశ, డైనమిక్ బ్యూరో : విఘ్నేశ్వరా.. ఆది పూజ నీకెనట.. భక్తులు ఏ కోరికలు కోరినా ఇట్టే తీరుస్తావట. మాకు దేశంలో పెద్ద సమస్య వచ్చి పడింది. ఆడపిల్ల కనిపిస్తే చాలు.. కామాంధులు కాటేస్తున్నారు. మా రక్షణ కోసం కొత్త చట్టాలు ఏవీ రూపుదిద్దుకోవడం లేదు. మా మాన, ప్రాణాలను కాపాడటం లేదు. స్వామీ.. నీవైన ఈ దేశంలోని ఆడ పిల్లలను కాపాడు. మా నాయకులకు బుద్ది వచ్చేలా చేసి, కఠిన చట్టాలను తెచ్చేలా చూడు.. అంటూ ఆడపిల్లలు వినాయకుడిని వేడుకుంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యాచారాలకు ఈ ఘటన అద్దం పట్టింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో కొందరు ఆడపిల్లలు విఘ్నేశ్వరునికి లేఖ రాశారు. హైదరాబాద్‌లో ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేస్తున్న సమయంలోనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించు స్వామీ అంటూ రాసిన లేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ లేఖ సారాంశం ఇలా ఉంది..
‘‘మేము భారతదేశంలో పుట్టిన ఆడపిల్లలం. మాకు రక్షణ లేకుండా పోయింది. మమ్మల్ని భూమి మీద ఉన్న ఎవరూ కాపాడటం లేదు. ప్రజాప్రతినిధులు ఎవరూ స్పందించడం లేదు. నిర్భయ, అభయ అంటూ ఎన్ని చట్టాలు వచ్చినా.. మమ్మిల్ని రక్షించలేకపోతున్నాయి. మా గురించి పార్లమెంటులో ప్రజాప్రతినిధులు చట్టాలు చేయలేకపోతున్నారు. దయచేసి మా నాయకులకు బుద్ది వచ్చే విధంగా చేసి, మా మొర ఆలకించు స్వామి అంటూ’’ బాలికలు లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖనే వినాయకుడి ముందు ఉంచి పూజలు చేశారు. నైవేధ్యంతో పాటు ఆ లేఖను వినతి పత్రంగా అందజేశారు. దానిలో పదుల సంఖ్యలో యువతులు సంతకాలు సైతం చేశారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఇప్పటికైనా హత్యాచారాలు ఆగాలని మనమూ కోరుకుందాం.