లవర్ గేమ్.. ప్రియుడి మృతి.. యువతి పన్నాగం తెలిసిందీలా..

by Sumithra |   ( Updated:2021-05-23 00:42:40.0  )
లవర్ గేమ్.. ప్రియుడి మృతి.. యువతి పన్నాగం తెలిసిందీలా..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలి కాలంలో తల్లిదండ్రులను బెదిరించడం యువతకు ఫ్యాషన్ గా మారిపోయింది. ఇష్టమైన బైక్ కొనివ్వకపోయినా, అడిగినంత డబ్బు ఇవ్వకపోయినా, ప్రేమించిన వారిని కాదన్న ఆత్మహత్య చేసుకొంటామని బెదిరిస్తున్నారు. ఇంకొంతమంది ఒకడుగు ముందుకేసి నిజంగా బెదిరించడానికి ఆత్మహత్య చేసుకున్నట్లు నాటకమాడుతున్నారు. తాజాగా ప్రేమించిన అమ్మాయి చెప్పిందని ఓ ప్రియుడు సూసైడ్ చేసుకున్నట్లు నాటకమాడి ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లాలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే..

అనుముల మండలం చింతగూడెం గ్రామానికి చెందిన కదిరె కోటి రాములు(21).. అదే గ్రామానికి చెందిన ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమ విషయం ఇటీవలే యువతి ఇంట్లో తెలియడంతో రాములుపై వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. అంతేకాకుండా యువతికి మరొకరితో పెళ్లి కూడా నిశ్చయించారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని యువతి తన ప్రియుడికి ఫోన్ చేసి చెప్పింది. ఇక తనను దక్కించుకోవడానికి ఒకటే మార్గమని, నువ్వు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు నాటకమాడమని సలహా ఇచ్చింది.

తన్ను ప్రేమించినవాడు హాస్పిటల్ లో ఉన్నాడని చెప్పి పెళ్లి మధ్యలో వచ్చేస్తానని చెప్పింది. అంతకన్నా వేరే మార్గం లేదనుకున్న రాములు శనివారం పురుగులమందు తాగి ప్రియురాలు చెప్పినట్లే తన స్నేహితులకు ఫోన్ చేసి విషయాన్ని తెలిపాడు. దీంతో వెంటనే రాములు స్నేహితులు, కుటుంబ సభ్యులు అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. పురుగులమందు అధిక మోతాదులో తీసుకున్నందువలనే రాములు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఇక, పురుగుల మందు తాగడానికి మందు.. రాములు, యువతి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వైరల్‌గా మారింది. యువకుడి మృతికి యువతే కారణమని రాములు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.

Advertisement

Next Story