వాటర్ ట్యాంక్ ఎక్కిన ప్రియురాలు

by Anukaran |
వాటర్ ట్యాంక్ ఎక్కిన ప్రియురాలు
X

దిశ, మానకొండూరు: తనను ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేసిన యువకునిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రవళి అనే యువతి వాటర్ ట్యాంక్ ఎక్కి నిరనస తెలుపుతోంది. మానకొండూరు మండలం ఖాదరగూడెం గ్రామంలో రవళి అనే యువతి తెల్లవారు జామునే వాటర్ ట్యాంక్ ఎక్కి తన ప్రియున్ని తనకు అప్పగించాలని డిమాండ్ చేస్తోంది.

ఈ నెల 1న కూడా తనకు న్యాయం చేయాలంటూ గ్రామ పంచాయితీ కార్యాలయం ముందు ఆమె ఆందోళన చేసింది. పోలీసులు కౌన్సెలింగ్ ఇప్పించి పంపించడంతో తన స్వగ్రామమైన చెంజర్లకు వెళ్లిపోయిన ఆమె మరుసటి రోజు తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోతో పాటు ఓ లేఖ కూడా రాసింది. అయితే ఆమె బంధువులు వద్దని వారించడంతో తన ప్రయత్నాన్ని విరమించుకుని మళ్లీ పోరాటం చేస్తోంది. ఆదివారం తెల్లవారుజామునే ఖాదరగూడెం వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలుపుతుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

Next Story