'గిఫ్ట్ ఏ స్మైల్' అంబులెన్సులు రెడీ

by Shyam |
గిఫ్ట్ ఏ స్మైల్ అంబులెన్సులు రెడీ
X

దిశ, న్యూస్‌బ్యూరో: పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కింద ప్రభుత్వానికి అందజేయనున్నట్లు హామీ ఇచ్చిన మేరకు ఆరు కోవిడ్ రెస్పాన్స్ అంబులెన్సులను గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌కు అందజేశారు. ప్రగతి భవన్‌లో ఆ ఆంబులెన్సులను కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు కేటీఆర్ సతీమణి శైలిమా, కూతురు అలేఖ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో పలువురు అంబులెన్సులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. త్వరలోనే వాటన్నింటినీ కూడా ప్రారంభిస్తామని పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా కేటీఆర్‌కి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇవి కోవిడ్ రెస్పాన్స్ వాహనాలుగా పనిచేస్తాయి. వీటిలో ఆక్సిజన్ సౌకర్యం, వెంటిలేటర్, కరోనా పరీక్షలు చేయడానికి అవసరమైన ఉపకరణాలు ఉన్నాయి.

Advertisement

Next Story