మా కార్పొరేటర్లు గీత దాటరు : మేయర్

by Shyam |
మా కార్పొరేటర్లు గీత దాటరు : మేయర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ గాలిలో రాళ్లు విసిరే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కొత్తగా గెలిచిన కార్పొరేటర్లను కన్ఫ్యూజ్ చేస్తున్నారని మండిపడ్డారు. నగరంలో టీఆర్ఎస్ తరపున గెలిచిన కార్పొరేటర్లు గీత దాటరు అని స్పష్టం చేశారు. అంతేగాకుండా బల్దియాపై మళ్లీ టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం అన్నారు. చట్టాలపై అవగాహన లేకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 10 వరకు ఇప్పుడున్న పాలకమండలికి సమయం ఉందని, ఆ తర్వాతే జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక జరుగుతుందని స్పష్టం చేశారు.

Advertisement

Next Story