- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వలస కార్మికులకు బల్దియా సాయం
by Shyam |
దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు సాయమందించేందుకు జీహెచ్ఎంసీ యంత్రాంగం సిద్ధమవుతోంది. బల్దియా పరిధిలో ప్రభుత్వ రేషన్ కార్డులు లేని వారికి మాత్రమే వర్తించేలా 12 కిలోల బియ్యం, రూ. 500 చొప్పున అందివ్వనున్నారు. పోలీసు, రెవెన్యూ, ప్రజా పంపిణీ వ్యవస్థ ముఖ్య అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రేషన్ అందజేసేందుకు కేంద్రాలను గుర్తించారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ రేషన్ తీసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరైనా రేషన్ కార్డు ఉన్నా కూడా తప్పుడు సమాచారంతో ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే వారి రేషన్ కార్డును రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటామని బల్దియా ముఖ్య అధికారులు స్పష్టం చేశారు.
tag: ghmc, helping, migrant workers, hyderabad
Advertisement
Next Story