- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిపికేషన్
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నవంబరు, డిసెంబరు మాసాల్లోనే జరిగే అవకాశం ఉందని, ఇందుకోసం త్వరలోనే నోటిఫికేషన్ వెలువడుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తుగా జరగాల్సిన కొన్ని పనులు ఇప్పటికే మొదలయ్యాయని, రాష్ట్ర ఎన్నికల సంఘం సిబ్బంది ఆ పనుల్లో నిమగ్నమయ్యారని తెలిపారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చర్యలు చేపడుతున్నామని, రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకున్నామని తెలిపారు. మెజారిటీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని బ్యాలెట్ బాక్సుల ద్వారానే ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు, చర్యలపై దృష్టి పెట్టామని తెలిపారు. సమయానుగుణంగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఫిబ్రవరి మొదటి వారం వరకు ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకవర్గం పదవీకాలం ఉందని వివరించారు.