- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సాంకేతిక మాంద్యం ముగిసే అవకాశం : ఇక్రా
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికవ్యవస్థ 7.8 శాతం ప్రతికూలంగా నమోదవ్వొచ్చని, అలాగే మూడో త్రైమాసికంలో కేవలం 1 శాతం మాత్రమే ప్రతికూలంగా ఉండొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అభిప్రాయపడింది. ఇక, చివరి త్రైమాసికంలో వృద్ధి 1.3 శాతానికి చేరుకుంటుందని తెలిపింది. ఇదివరకు ఇక్రా భారత వృద్ధి రేటును 7-9 శాతం సంకోచంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. మూడో త్రైమాసికంలో పెరుగుతున్న ముడిసరుకు, వేతన ఖర్చులు పారిశ్రామిక రంగంలో ప్రభావం చూపిస్తాయని, అలాగే, వ్యవసాయ రంగంలో స్థిరమైన పనితీరు, సేవల రంగంలో ఉన్న సవాళ్ల నేపథ్యంలో స్వల్పంగా 1 శాతం ప్రతికూలతను అంచనా వేశామని ఇక్రా తెలిపింది. అనంతరం కరోనా వ్యాక్సిన్ లభ్యత డిమాండ్‌ను బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు. ఎగుమతుల్లో పునరుజ్జీవనం, ప్రభుత్వ వ్యయాల పెరుగుదల కారణంగా నాలుగో త్రైమాసికంలో వృద్ధి సానుకూలంగా మారి 1.3 శాతానికి చేరుకుంటుందని ఇక్రా వెల్లడించింది. చివరి త్రైమాసికంలో సానుకూల వృద్ధితో భారత్ సాంకేతిక మాంద్యం నుంచి బయటపడే అవకాశముందని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ చెప్పారు.