‘వాళ్లకంటే ఎక్కువే ఇస్తున్నాం’

by Sridhar Babu |
‘వాళ్లకంటే ఎక్కువే ఇస్తున్నాం’
X

దిశ, కరీంనగర్: కరోనా, లాక్‌డౌన్ సమయంలో నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కేంద్రం కంటే ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వమే సాయం చేసిందని ఆయన చెప్పారు. కరీంనగర్‌ జిల్లా చర్లబుత్కూరులో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కోటి 91 లక్షల మందికి మాత్రమే బియ్యం సరఫరా చేస్తోందన్నారు. కానీ, టీఆర్ఎస్ సర్కార్ దానికి అదనంగా మరో 88 లక్షల మందికి అందిస్తోందని.. మొత్తం 2 కోట్ల 79 లక్షల మందికి ఇస్తున్నామన్నారు. తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కొరికి 10 కిలోల చొప్పున 5 నెలల పాటు బియ్యం అందిస్తామని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story