- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గాంధీలో ఫ్రంట్ లైన్ వారియర్స్ ఆందోళన
దిశ, సికింద్రాబాద్: తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గాంధీ ఆస్పత్రి ఔట్‌సోర్సింగ్ నర్సులు గత ఐదు రోజులుగా విధులు బహిష్కరించి నిరసన చేస్తున్నారు. తాజాగా మంగళవారం నాలుగో తరగతి సిబ్బంది అయిన (పారిశుద్ధ్య కార్మికులు, ఆయాలు వార్డు బాయ్స్, సెక్యూరిటీ సిబ్బంది) కూడా విధులు బహిష్కరించి రోడ్డు పై బైఠాయించారు.ప్రభుత్వం తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. నర్సుల సమ్మెకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం వారి జీతాలు పెంచేందుకు ముందుకు వచ్చింది. జీతాల పెంపుతో పాటు ఉద్యోగభద్రత కూడా కల్పించి, క్రమబద్దీకరించాలని వారు సమ్మెను కొనసాగిస్తున్నారు. అయితే, తాజాగా తమకు కూడా జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని ఔట్ సోర్సింగ్‌లోని శానిటేషన్ సిబ్బంది, ఆయాలు, భద్రతా సిబ్బంది ఒక్కరోజు సమ్మెకు దిగారు. ఆసత్రి బయట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
ఇదిలా ఉండగా అన్ని విభాగాల్లోని పారామెడికల్ సిబ్బంది (ల్యాబ్ టెక్నీషియన్లు, కంప్యూటర్ ఆపరేటర్లు) కూడా తమను పర్మినెంట్ చేసి జీతాలు పెంచాలని గాంధీ సూపరింటెండెంట్‌కు వినతి పత్రం సమర్పించారు.తమ సమస్యలు పరిష్కారం కాకపోతే ఆందోళనకు దిగుతామని స్పష్టంచేశారు. మరొక వైపు 2006 నుంచి పీఆర్సీ అమలు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని టీచింగ్ వైద్యులు ఆరోపించారు. పీఆర్సీ అమలు చేసి జీతాలు పెంచక పోతే తాము సమ్మెబాట పట్టక తప్పదని టీచింగ్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత సమయంలో ప్రభుత్వం వారితో చర్చలు జరిపి నిరసనను వివరమింపజేయాలని, లేకపోతే అనేక సమస్యలు ఎదురవుతాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.