- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
India GDP: నాలుగేళ్ల కనిష్ట స్థాయికి జీడీపీ వృద్ధి: ప్రభుత్వ అంచనా
దిశ, బిజినెస్ బ్యూరో: 2024-25 ఆర్థిక సంవత్సరానికి దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 6.4 శాతంగా ఉండనుందని గణాంకాల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. దీనివల్ల నాలుగేళ్ల కనిష్ఠ స్థాయికి వృద్ధి నమోదు కానుందని మంగళవారం ప్రకటనలో తెలిపింది. అయితే, ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2023-24లో సాధించిన 8.2 శాతం జీడీపీ వృద్ధి కంటే చాలా తక్కువ. 2024-25 ప్రథమార్థంలో వృద్ధి నెమ్మదించినప్పటికీ, ద్వితీయార్థంలో గ్రామీణ డిమాండ్‌తో పాటు వ్యవసాయం, పారిశ్రామిక కార్యకలాపాలు పెరిగాయి. తద్వారా వృద్ధి 6.4-6.8 శాతం సాధించే అవకాశాలు ఉన్నాయని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. మంత్రిత్వ శాఖ ముందస్తు అంచనా, వచ్చే నెలలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లెక్కల్లో కీలక పాత్ర పోషిస్తుంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 5.4 శాతం జీడీపీ వృద్ధి షాక్ ఇచ్చింది. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఐ వృద్ధి అంచనాను మునుపటి 7.2 శాతం నుంచి 6.6 శాతానికి సవరించింది. వృద్ధి నెమ్మదించినప్పటికీ కీలక రంగాలు ఆశాజనకంగా ఉన్నాయి. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలు 2024-25కి 1.4 శాతం నుంచి 3.8 శాతానికి పెరుగుతాయని అంచనా. నిర్మాణ రంగం 8.6 శాతం, ఆర్థిక, రియల్ ఎస్టేట్, వృత్తిపరమైన సేవలు 7.3 శాతం వృద్ధి చెందుతుందని మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.