- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భారత్ బయోటెక్ సీఎండీకి INSA ఫెలోషిప్ అవార్డు
దిశ, తెలంగాణ బ్యూరో: వ్యాక్సిన్‌ల తయారీ దిగ్గజ సంస్థ భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా 2025 సంవత్సరానికి గానూ ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ( ఐఎన్ఎస్ఏ) అందించే ప్రతిష్టాత్మక ఇండియా ఫెలోషిప్‌కు ఎంపిక అయ్యారు. కొత్త ఆవిష్కరణలు, విజ్ఞానం, వ్యాక్సిన్ అభివృద్ధి, తదితర అంశాల్లో ఆయన చేసిన కృషికి ఈ ఫెలోషిప్ వరించింది. ఇప్పటికే ఈ ఫెలోషిప్ ల జాబితాలో జాబితాలో భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ అనిల్ కకోద్కర్, డిఆర్‌డిఓ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వికె సరస్వత్, ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్, ఇంకా విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు ఉండటం విశేషం. ఈ సంవత్సరం మొత్తం 61 ఫెలోషిప్‌లు ఐఎన్ఎస్ఏ అందించగా అందులో పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా ఎండీ ఎల్లా కృష్ణ మాట్లాడుతూ.. ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, కొత్త వ్యాక్సిన్‌లను కనుగొనడంలో భారత్ ను ఆధిపత్య శక్తిగా మార్చేందుకు ఎల్లవేళలా కృషి చేస్తామన్నారు. భారత్ లో వ్యాక్సిన్ తయారీ, బయోటెక్నాలజీ రంగంలో తమ పురోగతిని గుర్తించిన ఐఎన్ఎస్ఏ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు, కొత్త ఆవిష్కరణలను కనుగొనేందుకు తాము ఎల్లవేళలా ముందుంటామని, ఇందుకు తోడ్పాటు అందించిన సహచర భారత్ బయోటెక్ బృందం సేవలు మరువలేనివని, ప్రతి ఒక్కరు ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేశారని కొనియాడారు. ఈ అవార్డుకు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
దాదాపు 3 దశాబ్దాలుగా, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ల ఆవిష్కరణలు, తయారీలో ముందంజలో ఉందన్నారు. అలాగే వ్యాక్సిన్ల పంపిణీలో 125 దేశాలకు 9 బిలియన్ల కంటే ఎక్కువ వ్యాక్సిన్‌లను పంపిణీ చేసిందన్నారు. 1935లో ఏర్పాటైన ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ(ఐఎన్ఎస్ఏ) భారత్ లో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. అంతేకాకుండా సైంటిఫిక్ అకాడమీలు, సొసైటీలు, సంస్థలు, ప్రభుత్వ వైజ్ఞానిక విభాగాలకు సమన్వయ కర్తగా పనిచేస్తుందన్నారు. తద్వారా భారతదేశంలోని శాస్త్రవేత్తల ప్రయోజనాలను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందన్నారు. అలాగే దేశంలో జరిగే ఆవిష్కరణలను అంతర్జాతీయంగా ప్రదర్శించడానికి ప్రముఖ శాస్త్రవేత్తల సంఘంగా పనిచేస్తుందన్నారు.