విషాదం.. షటిల్ ఆడుతూ ప్రాణాలు విడిచిన సీఐ

by Anukaran |   ( Updated:2023-05-19 12:50:39.0  )
విషాదం.. షటిల్ ఆడుతూ ప్రాణాలు విడిచిన సీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: మృత్యువు.. ఒక మనిషి జీవిత కాలంలో ఎప్పుడు వస్తుందో.. ఎలా వస్తుందో.. ఎటువంటి ముగింపునిస్తుందో ఎవరికి తెలియదు. వచ్చిందంటే ప్రాణాల్ని తీసుకుంటుంది. మనం ఎంత వద్దనుకున్న విధి రాతను మార్చలేం.. ఎందుకంటే చావు మనచేతిలో లేదు అనేది నిత్య సత్యం. అనుకోకుండా జరిగే ఈ పరిణామం సహజం. కానీ, బాడీ ఫిట్‌నెస్, మానసిక ఉల్లాసం కోసం మనం ఎంచుకునే ఆటల్లో కూడా ప్రాణాలు కోల్పోతున్నారు పలువురు. ఇటువంటి ఘటనలు చాలా వరకు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఇటువంటి ఘటన ఏపీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో విషాదాన్ని నింపింది. పశ్చిమగోదావరి జిల్లా గణపవరం సీఐ షటిల్ ఆడుతూ ప్రాణాలు విడిచారు. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో సీఐ భగవాన్ ప్రసాద్ సన్నిహితులతో కలిసి సమీపంలోని ఇండోర్ స్టేడియంలో షటిల్ ఆడుతున్నారు. ఇదే సమయంలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story