ఆరుగురు జూదరులు అరెస్ట్

by Shyam |
ఆరుగురు జూదరులు అరెస్ట్
X

దిశ, మునుగోడు: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లసింగారంలో ఆరుగురు పేకాటరాయుళ్లను చౌటుప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి నిందితుల నుంచి 4 బైకులు, ఏడు సెల్ ఫోన్లు, రూ.5,650 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నర్సయ్య తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story