బాధ్యత ఉండక్కర్లేదా?: వైఎస్సార్సీపీ నేతలపై గల్లా ఆగ్రహం

by srinivas |
బాధ్యత ఉండక్కర్లేదా?: వైఎస్సార్సీపీ నేతలపై గల్లా ఆగ్రహం
X

వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సోకకుండా ఉండేందుకు ఎన్ 95 మాస్కులు, గ్లౌస్‌లు సరిపడా లేవని వైద్యులతో పాటు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అవసరమున్నా లేకున్నా వైఎస్సార్సీపీ నేతలు ఎన్95 మాస్కులు వేసుకుని తిరుగుతున్నారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో పోలీసులు, పారిశుధ్యకార్మికులకు ఒక స్వచ్ఛంద సంస్థ గుడ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టింది.

అందులో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్, మోపిదేవి వెంకట్రమణ తదితరులు పాల్గొన్నారు. వారంతా ఎన్-95 మాస్కులు, శస్త్రచికిత్సల సమయంలో ధరించే చేతితొడుగుల (గ్లోవ్స్)తో కనిపించడాన్ని ఆయన ప్రశ్నించారు. వైద్యసిబ్బంది కోసం నిర్దేశించిన ఎన్95 మాస్కులను, సర్జికల్ గ్లోవ్స్ ను కోడిగుడ్ల పంపిణీ కోసం వృథా చేస్తారా? బాధ్యత లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కూడా, భౌతిక దూరం పాటించాలన్న సూచనను పట్టించుకోకుండా గుడ్ల పంపిణీ చేశారని విమర్శించారు. డాక్టర్లను, ఇతర అత్యవసర సిబ్బందిని అలక్ష్యం చేస్తూ, రాజకీయాలే తమకు మొదటి ప్రాధాన్యం అని వైఎస్సార్సీపీ నేతలు నిరూపించారని ఆయన మండిపడ్డారు.

Tags: ysrcp, tdp, vijayasai reddy, galla jayadev, avanthi, mopidevi

Advertisement

Next Story