హుజురాబాద్‌లో ‘గద్దర్’.. వారిపై సంచలన వ్యాఖ్యలు (వీడియో)

by Anukaran |   ( Updated:2023-05-19 13:27:49.0  )
హుజురాబాద్‌లో ‘గద్దర్’.. వారిపై సంచలన వ్యాఖ్యలు (వీడియో)
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ప్రజాయుద్దనౌక గద్దర్ హుజురాబాద్‌లో పర్యటించారు. మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు చైతన్యవంతులు కావల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఎక్కడైనా ఏ పార్టీ వారైనా పాలకులు మానవ చరిత్రలో ఎప్పుడూ కలిసే ఉన్నారన్నారు.

వారికి ఆత్మీయమైన, కుల పరమైన, వర్గపరమైన, అంతర్జాతీయమైన అలయెన్సు కూడా ఉంటుందని వ్యాఖ్యానించారు. పాలితులందరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని గద్దర్ అన్నారు. చైతన్యవంతమైనటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు తాను సూపరిచుతున్నేనని, తిరగని పల్లె లేదు పాడని పాట లేదన్నారు. పాలితులు ఐక్యమై ఆత్మవిమర్శ చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story