ఫ్లెక్సీ తెచ్చిన లొల్లి..

by Anukaran |
ఫ్లెక్సీ తెచ్చిన లొల్లి..
X

దిశ, వెబ్ డెస్క్ : ఏ పార్టీలోనైన పదవి కోసం గొడవలు పెట్టుకోవడం చూస్తాం. కానీ ఫ్లెక్సీ కోసం కొట్టుకోవడం ఇదే మొదటి సారేమో మరీ . ఇది ఎక్కడా అనుకుంటున్నారా.. కృష్ణా జిల్లా కైకలూరులో ఈ గొడవ చోటు చేసుకుంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బంద్‌ కొనసాగుతోంది.

ఈ క్రమంలో కైకలూరులో తెలుగు దేశం పార్టీ, వైసీపీ వామపక్ష శ్రేణులు బంద్‌లో పాల్గొన్నాయి. అయితే అఖిలపక్ష ఆందోళనలో ఒకే పార్టీ ప్లెక్సీ ఏర్పాటుపై రెండు పార్టీల మధ్య వాగ్వాదంతో పాటు స్వల్ప ఘర్షణ జరిగింది. ఈక్రమంలో టీడీపీ ఇన్‌ఛార్జి జయమంగళ వెంకటరమణ చేతిలో ఉన్న ప్లెక్సీని వైసీపీ కార్యకర్తలు చించేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను అదుపు చేశారు. దీంతో వైసీపీ శ్రేణుల తీరును నిరసిస్తూ జయమంగళ వెంకటరమణ, టీడీపీ కార్యకర్తలు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

Advertisement

Next Story