త్వరపడండి.. ఉచిత వసతితో సహా SSC, RRB పరీక్షలకు ఫ్రీ కోచింగ్!

by Aamani |
త్వరపడండి.. ఉచిత వసతితో సహా SSC, RRB పరీక్షలకు ఫ్రీ కోచింగ్!
X

దిశ, బోథ్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఆదిలాబాద్ పట్టణంలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో 5 నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణను రాష్ట స్థాయి నిపుణులచే అందించనుంది. ఇందులో బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీలతో పాటు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందించనున్నట్టు స్టడీ సర్కిల్ డైరక్టర్ డాక్టర్ రమేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ శిక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఈ నెల 30లోగా www.tsstudycircle.com.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు పంపాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబరు 05న ప్రవేశ పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా శిక్షణకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఎంపికైన వారికి డిసెంబరు 15 నుంచి మే 15 వరకు శిక్షణ ఉండనుంది. మరిన్ని వివరాలకు 9494149416, 9398784343 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.

Advertisement

Next Story