విషాదం: ఓ కుటుంబానికి చెందిన నలుగురు..

by Sumithra |   ( Updated:2021-06-04 02:11:45.0  )
విషాదం: ఓ కుటుంబానికి చెందిన నలుగురు..
X

దిశ, వెబ్డెస్క్ : మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలో విషాదం చోటు చేసుకుంది. ఓకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఉరి వేసుకుని పిల్లలతో సహా దంపతులు శుక్రవారం ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు భిక్షపతి, ఉష, హర్షిణి, యశ్వంత్ గా గుర్తింపు. భిక్షపతి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.

అయితే వీరి పక్కింటిలో ఉన్న ఓ బాలిక పట్ల భిక్షపతి అసభ్యకరంగా వ్వవహరిస్తున్నాడని స్థానికులు గురువారం రాత్రి అతనిపై దాడిచేశారు. అనంతరం ఉదయం పెద్దల సమక్షంలో మాట్లాడదామని వెళ్లిపోయారు. దీంతో అవమానం భరించలేక భిక్షపతి తన భార్యపిల్లలకు ఉరివేసి అనతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భిక్షపతి స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాంపేట కాగా కొన్నేళ్ల క్రితం బతుకు దెరవుకోసం కీసర పరిధిలోని నాగారం వెస్ట్ గాంధీనగర్ కు వచ్చి అక్కడే నివసిస్తున్నారని స్థానికులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story